నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెంలో జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ గుంటుపల్లి మాలకొండయ్య నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గ్రామ పెద్దల సహాయంతో ఇంటింటికీ తిరిగి నిత్యావసరాలు పంపిణీ చేశారు. సుమారు 1,100 కుటుంబాలకు సరకులు పంచారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తన వంతు సాయం అందించినట్లు మాలకొండయ్య తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు