ETV Bharat / state

దిల్లీ మద్యం కుంభకోణం: 10 రోజుల ఈడీ కస్టడీకి మాగుంట రాఘవరెడ్డి - మాగుంట వార్తలు

Delhi liquorgate case: దిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడుకి దిల్లీలోని దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 10రోజుల కస్టడీ విధించింది. బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్న రాఘవరెడ్డిని.. దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసిన అధికారులు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రాఘవను 10 రోజుల కస్టడీకి అనుమతించింది.

Magunta Raghava Reddy
మాగుంట రాఘవరెడ్డి
author img

By

Published : Feb 11, 2023, 4:01 PM IST

Updated : Feb 12, 2023, 8:46 AM IST

YSRCP MP’s son Magunta Raghava Reddy arrested by ED: దిల్లీ మద్యం కుంభకోణంపై దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌- ఈడీ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని అరెస్టుచేసిన ఈడీ...సౌత్‌ గ్రూప్‌ ద్వారా 100 కోట్లు వసూలు చేసి ముడుపులు ముట్టజెప్పిన కేసులో రాఘవ కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ మొత్తంలో 30 కోట్ల వివరాలు తెలుసుకునేందుకు రాఘవరెడ్డిని పదిరోజులు కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక కోర్టును కోరింది. ఈ మేరకు రాఘవరెడ్డిని పదిరోజుల కస్టడీకి అనుమతిస్తూ... దిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులోఈనెల 8న అరెస్టుచేసిన బుచ్చిబాబు కస్టడీ ఇవాళ ముగియడంతో పద్నాలుగు రోజులు రిమాండ్‌ విధించింది.

దిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పాత్ర కీలకమని ఈడీ తెలిపింది. రాఘవరెడ్డిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. దిల్లీ కోర్టులో హాజరు పరిచారు. మాగుంట రాఘవకు మద్యం తయారీ, హోల్ సెల్ వ్యాపారం ఉన్నాయని.. రెండు రిటైల్ జోన్స్ కూడా ఉన్నట్లు వివరించారు. సౌత్ గ్రూప్ పేరుతో 100 కోట్లు వసూలు చేసి, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల ద్వారా ముడుపులు ముట్టజెప్పారని కోర్టుకు నివేదించారు. 100 కోట్ల ముడుపుల్లో రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, అమిత్ ఆరోరా, బినోయ్ బాబు, బుచ్చిబాబు అరెస్టు అయ్యారని... దర్యాప్తు పురోగతిలో ఉందని కోర్టుకు చెప్పారు. ఇప్పటికే అరెస్టైన శరత్ చంద్రారెడ్డితో రాఘవరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ముడుపుల సమీకరణలో సమీర్ మహేంద్రు కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు.

ఇండో స్పిరిట్ కంపెనీలో సమీర్ మహేంద్రుతో పాటు మాగుంట రాఘవరెడ్డికి భాగస్వామ్యం ఉందని... ఆ సంస్థ నుంచి షేర్ కూడా వెళుతుందన్నారు. దిల్లీ మద్యం విధానంతో లబ్ధి పొందేందుకు హవాలా మార్గంలో ముడుపులు ఇచ్చారని కోర్టుకు వివరించారు. పీఎమ్ఎల్ఏ చట్టం సెక్షన్ 50 ప్రకారం 30 మంది స్టేట్ మెంట్లు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ వివరాలను ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జిషీట్లలో పొందిపరిచామన్న ఈడీ అధికారులు కార్టలైజేషన్ , సంబంధిత వ్యక్తులకు ముడుపులు చేరవేయడంలో వీరు ముఖ్యమైన వాళ్లని అన్నారు. ముడుపుల్లో 30 కోట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు... రాఘవరెడ్డిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు జరిగిన కొద్దిపాటి దర్యాప్తులోనే ఇన్నిరకాల విషయాలు బయటికి వచ్చాయని.. ఈ కేసుతో సంబందం ఉన్నవారందరితో సన్నిహిత సంబంధాలు ఉన్న రాఘవరెడ్డిని మరింతగా ప్రశ్నిస్తే చాలా వివరాలు తెలుస్తాయని కోర్టుకు ఈడీ తెలిపింది.

ఈడీ ఏర్పడిన ప్రత్యేక చట్టం ప్రకారం అరెస్టుకు ముందు తమకు చెప్పాల్సిన అవసరం ఉందని.... కానీ అరెస్టు చేస్తూ దాఖలు చేసిన అప్లికేషన్ కూడా ఇవ్వలేదని రాఘవరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే రిమాండ్ అప్లికేషన్ అందించలేదని వాదించగా... అరెస్టు చేస్తున్నట్లు ముందుగానే నిందితుడికి చెప్పినట్లు ఈడీ న్యాయవాది వాదించారు. నిందితుడి సంతకాలు తీసుకున్న తర్వాతే కస్టడీలోకి తీసుకున్నట్లు వివరించారు.

దీనిపై అభ్యంతరం తెలిపిన రాఘవరెడ్డి తరపు న్యాయవాది... అప్పటికప్పుడు అనేక పేజీలున్న డాక్యుమెంట్ ఇస్తే ఎలాగని ప్రశ్నించారు. పోలీసులు అరెస్టు చేయనప్పుడు, పోలీస్ కస్టడీ ఎలా కుదరుతుందని అడిగారు. అరెస్టు చేసే అధికారం లేని ఈడీ... ఎలా అరెస్టు చేస్తుందని ప్రశ్నలు వేశారు. కస్టమ్స్ చట్టం ప్రకారం అరెస్ట్ చేసే అధికారం ఉన్నా... ఇక్కడ ఆ సెక్షన్లు లేవని వాదనలు వినిపించారు. ఇలాంటి సందర్భంలో మేజిస్ట్రేట్ తన కస్టడీలోకి తీసుకోవచ్చని, లేదంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని రాఘవరెడ్డి న్యాయవాది కోర్టుకు నివేదించారు. జీఎస్టీ చట్టం తరహాలోనే ఈడీ చట్టం కూడా ఉందన్న రాఘవ న్యాయవాది అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదని వాదించారు. వారసత్వంగా వచ్చిన వ్యాపారం చేయడం తప్పెలా అవుతుందని... ఈడీ తమపై తప్పుడు అంశాలను రుద్దుతోందని న్యాయమూర్తికి నివేదించారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే అధికారం ఈడీకి ఉందన్న దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది.. సమాచార సేకరణకు కస్టడీకి తీసుకోవచ్చనే తీర్పు ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు.

అంతకుముందు కేసులో మరో నిందితుడు బుచ్చిబాబు కస్టడీ ముగియడంతో అతన్ని కూడా కోర్టులో హాజరుపరిచారు. బుచ్చిబాబు వాట్సప్ సందేశాల్లో... దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కీలక సమాచారం ఉందని...అనుమానాస్పద, నేరాన్ని ప్రోత్సహించేలా ఉన్న సందేశాలు ఉన్నాయంటూ.... వాటిని జడ్జికి చూపించారు. మద్యం విధానం అధికారికంగా బయటికి రాకముందే... బుచ్చిబాబు మొబైల్‌లో ఆ సందేశాలు ఉన్నట్లు వివరించారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున... జ్యుడిషియల్ రిమాండుకు పంపాలని కోరారు. మందులు, ఇతర అత్యవసరాలను అనుమతించాలన్న బుచ్చిబాబు తరపు న్యాయవాది వినతిని అంగీకరించిన కోర్టు... 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

10 రోజుల ఈడీ కస్టడీకి మాగుంట రాఘవరెడ్డి

ఇవీ చదవండి:

Last Updated : Feb 12, 2023, 8:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.