YSRCP Leders Attemt Murder With knife in Property Dispute : నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నాయకులు బరితెగించారు. ఆస్తి వివాదంలో ఐదుగురిపై కత్తులతో భయానకంగా దాడికి తెగబడ్డారు. వైసీపీకి చెందిన సుబ్బారెడ్డి, ఆయన అనుచరుడు విజయ్‌రెడ్డి మరికొందరితో కలిసి కత్తులతో స్వైర విహారం చేశారు. ఈ దారుణ ఘటనలో ఒకరు మృతి చెందారు. చనిపోయిన వ్యక్తిని సూరిశెట్టి సురేష్‌గా గుర్తించారు. నాగిశెట్టి శ్రీనివాసులు, నాగిశెట్టి పవన్, నాగిశెట్టి సుష్మతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
భూ వివాదంలో మైనార్టీపై దాడి చేసిన వైసీపీ నాయకులు - చికిత్స పొందుతున్న బాధితుడు
Nellore latest crime : కావలి 34వ వార్డు ముసునూరులో సుబ్బారెడ్డి అనే వ్యక్తి గతంలో చిట్టీల వ్యాపారం చేశారు. అయితే చిట్టీలు కట్టిన కొందరికి డబ్బులు చెల్లించలేదు. ఈ పరిస్థితుల్లో సూరిశెట్టి సురేష్ వద్ద ఇంటిని తాకట్టు పెట్టారు. 20 రోజులుగా సురేష్ కుటుంబంతో కలిసి ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల తన ఇంటిని తిరిగివ్వాలంటూ సురేష్‌పై సుబ్బారెడ్డి ఒత్తిడి పెంచారు. కొన్ని రోజులుగా ఈ విషయంలో ప్రజా ప్రతినిధుల వద్ద పంచాయతీ కూడా జరిగింది. డబ్బు చెల్లించి ఇంటిని స్వాధీనం చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు సూచించారు. సుబ్బారెడ్డి అంగీకరించారు. ఇంటిని అప్పగిస్తే విక్రయించి డబ్బులు చెల్లిస్తామని సురేష్‌కు చెప్పారు. ఈ క్రమంలో ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు సుబ్బారెడ్డి, విజయ్‌రెడ్డి వెళ్లగా సురేష్, అతని బంధువులు అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెరిగి పెద్దదై సుబ్బారెడ్డి, విజయ్‌రెడ్డి కత్తులతో సురేష్‌పై దాడి చేశారు. మద్దతుగా వచ్చిన మరో నలుగురిపైనా కత్తులు ఝుళిపించారు.
తెలుగు యువత అధికార ప్రతినిధిపై వైసీపీ అనుచరుల దాడి - ఖండించిన లోకేశ్
YSRCP Leders Murderd A mam In Property Issue : ఆస్తి వివాదం ఇలా దాడులకు పురికొల్పడంపై స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. హత్య వరకు దారితీసిన ఈ ఘటన నెల్లూరులో కలకలం రేపింది. వైసీపీకు చెందిన సుబ్బారెడ్డి అతని అనుచరులు కత్తులతో చేసిన స్వైర విహారానికి నిండు ప్రాణం బలయ్యింది. ఒకరు పలువురు తీవ్ర గాయాలయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
జరిగిన ఘటనపై కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా తన భార్య పేరు మీద ఉన్న ఇల్లును సురేశ్ అనే వ్యక్తికి తాకట్టు పెట్టగా గత 20 రోజులుగా ఈ సురేష్ కుటుంబం సుబ్బారెడ్డి తాకట్టు పెట్టిన ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఈరోజు సుబ్బారెడ్డి, విజయరెడ్డి., సురేష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఇంటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల గురించి గొడవపడ్డారు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి, విజయరెడ్డి సురేష్ కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలపాలయ్యారు. సురేష్‌ను ఆసుపత్రి తరలిస్తూ తరలిస్తుండగా మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. కేసులు దర్యాప్తు చేస్తున్నట్టు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.
టీడీపీ నేతపై వైసీపీ కార్యకర్తల దాడి, అదే పార్టీ ఎమ్మెల్యే పరామర్శ - ఇదెందయ్యా ఇది