నెల్లూరు జిల్లా గూడూరులో గ్రావెల్ అక్రమ దందా కొనసాగుతోంది. సిలికా నుంచి గ్రావెల్ రవాణా చేసే క్రమంలో అడ్డొచ్చిన అధికారులు, సిబ్బందిపైనా దాడులకు పాల్పడుతున్నారు. ఇవాళ తెల్లవారు జామున 4 గంటల సమయంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని అడ్డుకుంటుండగా .. వైకాపా నాయకుడు కోటి తనపై దాడి చేసినట్లు వీఆర్వో హనుమంతరావు వాపోయారు. ప్రస్తుతం వీఆర్వో గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి...
అక్రమ గ్రావెల్ తరలింపును అడ్డుకున్న వీఆర్ఓ హనుమంతరావుపై వైకాపా నాయకుడు కోటేశ్వరరావు, అతని అనుచరులు కలిసి దారుణంగా దాడి చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఓ వీడియోను ట్వీట్ కు జత చేశారు. నెల్లూరు జిల్లాలో వైకాపా అక్రమ గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోందని ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో ఉద్యోగులకు, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.
గూడూరులో అక్రమ గ్రావెల్ మైనింగ్ వెనుక ఉన్న వైకాపా నాయకుల పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఓ హనుమంతరావుపై దాడి చేసిన వైకాపా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన హనుమంతరావుకు మెరుగైన వైద్యం అందించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
-
నెల్లూరు జిల్లాలో వైకాపా అక్రమ గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. గూడూరు లో అక్రమ గ్రావెల్ తరలింపుని అడ్డుకున్న విఆర్ఓ హనుమంతరావు గారి పై వైకాపా నాయకుడు కోటేశ్వరరావు, అతని అనుచరులు కలిసి దారుణంగా దాడి చేసారు. @ysjagan అరాచక పాలనలో ఉద్యోగస్తులకు, ప్రజలకు రక్షణ లేకుండా పోయింది.(1/2) pic.twitter.com/09NeAGVJ4A
— Lokesh Nara (@naralokesh) January 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">నెల్లూరు జిల్లాలో వైకాపా అక్రమ గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. గూడూరు లో అక్రమ గ్రావెల్ తరలింపుని అడ్డుకున్న విఆర్ఓ హనుమంతరావు గారి పై వైకాపా నాయకుడు కోటేశ్వరరావు, అతని అనుచరులు కలిసి దారుణంగా దాడి చేసారు. @ysjagan అరాచక పాలనలో ఉద్యోగస్తులకు, ప్రజలకు రక్షణ లేకుండా పోయింది.(1/2) pic.twitter.com/09NeAGVJ4A
— Lokesh Nara (@naralokesh) January 28, 2021నెల్లూరు జిల్లాలో వైకాపా అక్రమ గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. గూడూరు లో అక్రమ గ్రావెల్ తరలింపుని అడ్డుకున్న విఆర్ఓ హనుమంతరావు గారి పై వైకాపా నాయకుడు కోటేశ్వరరావు, అతని అనుచరులు కలిసి దారుణంగా దాడి చేసారు. @ysjagan అరాచక పాలనలో ఉద్యోగస్తులకు, ప్రజలకు రక్షణ లేకుండా పోయింది.(1/2) pic.twitter.com/09NeAGVJ4A
— Lokesh Nara (@naralokesh) January 28, 2021
ఇదీ చదవండి: