గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఉపయోగించుకుని రైతులు అభివృద్ధి చెందాలని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో వైఎస్ఆర్ రైతు దినోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రైతులు పంటలు వేసిన దగ్గర నుంచి వారి ఉత్పత్తులు అమ్ముకునే వరకు రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
వ్యవసాయాధికారుల సేవలను జిల్లా కలెక్టర్ ఎం.వీ శేషగిరిబాబు అభినందించారు. పచ్చిరొట్ట విత్తనాల సరఫరా, నష్టపరిహారం, పంటల భీమా, పీఎం.కిసాన్ వంటి సేవలను చక్కగా రైతులకు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: