నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని ఓ యువతి గొంతు కోశాడు. పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన చిగురుపాటి జ్యోతిని (17) గత కొంత కాలంగా ప్రేమించాలంటూ చెంచు కృష్ణ అనే యువకుడు వేధిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని మందలించారు.
ఈరోజు ఇంట్లో నిద్రిస్తున్న జ్యోతిని చూసి నేరుగా ఇంటిలోకి జోరబడి చాకుతో గొంతు కోశాడు. గొంతు కోసిన తర్వాత నింపాదిగా వెళ్లి కల్లు తాగి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
నిందితుడు అరెస్ట్
వెంకటగిరిలో... ఓ మైనర్ బాలిక గొంతు కోసిన ప్రేమోన్మాదిని.. గంటల వ్యవధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై హత్యాయత్నం, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విజయరావు వెల్లడించారు. వెంకటగిరికి చెందిన చెంచు కృష్ణ అనే యువకుడు... గత కొంత కాలంగా ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలికని ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. బాలిక నిరాకరించడంతో కక్ష పెంచుకున్న చెంచు కృష్ణ... బాలిక ఇంటికి వెళ్లి కత్తితో గొంతుకోసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాలికకు ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. నిందితుడు అతని ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా.. అడ్డుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి: సాగర్ కాలువలోకి దూకిన ప్రేమజంట.. యువతిని రక్షించిన స్థానికులు