ETV Bharat / state

అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు... కలెక్టర్​కు ఎంపీ ఆదాల లేఖ - YCP MP Adala letter to the Nellore Collector

YCP MP ADALA PRABHAKAR LETTER TO NELLORE COLLECTOR : నెల్లూరు నగరపాలక సంస్థ అధికారుల అక్రమాలపై.. జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు.. వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి లేఖ రాశారు. అయితే దీనిపై ఏకంగా అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు స్పందించడం.. వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

YCP MP AADALA PRABHAKAR LETTER TO NELLORE COLLECTOR

author img

By

Published : Apr 11, 2023, 2:16 PM IST

YCP MP ADALA PRABHAKAR LETTER TO NELLORE COLLECTOR : ఇల్లు కట్టాలన్న సామాన్యుల కలను.. వెరిఫికేషన్ పేరుతో కల్లగా మార్చడం.. భవన నిర్మాణానికి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు పొందినప్పటికీ.. కొర్రీల పేరుతో దండుకోవడం.. అనుమతులకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు జరిపినా సొంత ప్రయోజనం చూసుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరించడం అక్కడ ఎప్పుడూ జరిగేదే! ఇప్పుడు.. కలెక్టర్ ఆదేశాలనే భేఖాతరు చేశారు. దరఖాస్తు చేసిన వెంటనే అనుమతులు ఇచ్చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలోనూ పరిశీలించిన దాఖలాలు లేవు. అయితే దీనిపై ఏకంగా అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు స్పందించడం.. వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు బరితెగిస్తున్నారు. భూ కబ్జాదారులతో కలిసి అనుమతి లేని లే అవుట్లలో భవన నిర్మాణాలు మంజూరు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమించి వేసిన లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని గతంలో కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఆక్రమణలు తొలగించి.. ఇరిగేషన్ స్థలాలు యథాస్థితికి తీసుకురావాలని సూచించగా వాటిని ధిక్కరించి పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వారే అక్రమాలకు పాల్పడ్డారు. చట్టబద్ధంగా కేటాయించిన విధులపై భక్తి, నైతిక బాధ్యత లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకోండి'-కలెక్టరుకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రాసిన లేఖ

ఓ ప్రజాప్రతినిధి అండతో.. నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగంలో కీలక బాధ్యతలు పోషిస్తున్న ఓ అధికారి అక్రమాలను పెంచి పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ ప్రజా ప్రతినిధికి నమ్మినబంటుగా ఉంటూ... ఆయన అండతో నిబంధనలను పట్టించుకోవడం లేదన్నది సొంత శాఖలోనే వినిపిస్తున్న మాట. నగరపాలక సంస్థలో డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, ఒక టీపీవో, అయిదుగురు టీపీఎస్​లు, తొమ్మిది మంది బిల్డింగ్ ఇన్​స్పెక్టర్​ ఉండాల్సి ఉండగా.. కేవలం ఇద్దరు టీపీవోలు, ముగ్గురు టీపీఎస్​లు, ఒక బిల్డింగ్ ఇన్​స్పెక్టర్​ మాత్రమే ఉన్నారు. సిబ్బంది లేరనే కారణాన్ని చూపి.. కనీసం తనిఖీలకూ వెళ్లని పరిస్థితి ఉంది. భవన నిర్మాణదారుల దగ్గర డబ్బు వసూలు చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో గత కమిషనర్ ఆయనపై విచారణకు ఆదేశించారు. ఇప్పుడు ఆయనే ఆ శాఖలో కీలక పదవిలో ఉండటం గమనార్హం. దీనిపై ఇన్చార్జి కమిషనర్ చెన్నుడును వివరణ కోరగా.. ఎంపీ ఆదాల ప్రభాకర్​రెడ్డి లేఖ రాసిన విషయం నా దృష్టికి రాలేదు. రెండు రోజుల నుంచే ఇన్ఛార్జిగా ఉన్నాను. పూర్తి వివరాలు కనుక్కుంటాను.. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు..
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో గత సంవత్సరం భారీ లేఅవుట్ వేశారు. ఫిర్యాదుల నేపథ్యంలో గత కలెక్టర్ చక్రధరబాబు వేసిన విచారణ కమిటీ పరిశీలించి.. దాదాపు 3.91 ఎకరాలు కాలువ పోరంబోకు, 2.39 ఎకరాలు కాలువ గట్టు ఆక్రమించినట్లు గుర్తించింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోకపోవడం.. నుడా నుంచి అనుమతులు తీసుకోకపోవడంతో.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కదా! యథేచ్ఛగా జరుగుతున్న నిర్మాణాలనూ అడ్డుకోలేదు.

మరో లే అవుట్లో నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి వదలాల్సిన స్థలం వదలకపోగా దాదాపు 38 సెంట్ల ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించారు. గత కలెక్టర్ ఆదేశాలతో సర్వే చేసి.. ఇరిగేషన్ అధికారులే తేల్చిన విషయం. ఇందులోనూ ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని అధికారులు ఆదేశించినా.. నెల్లూరు పట్టణ ప్రణాళికా విభాగానికి పట్టడం లేదు. ఇష్టానుసారం అనుమతులిస్తుండటం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.