నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మాజిరాపల్లిపాలెంలో తెలుగుదేశం కార్యకర్తపై వైకాపా నేతలు దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. అనంతరం తనను భయపెట్టి గ్రామం నుంచి తరిమేశారని వాపోయారు. రాములవారి తిరునాళ్లలో రికార్డ్ డాన్స్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చాననే అనుమానంతో ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యారు.
ఇదీచదవండి: కొవిడ్-19 రోగులను చేర్చుకోవడం ఆపేశాం..!