నెల్లూరు జిల్లా విరువూరు గ్రామంలో కుటుంబ కలహాలతో దంపతులు ఒకరి తరువాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... విరువూరుకు చెందిన రఫీ భార్య బీబీ జాన్... తన తల్లి అనారోగ్యంతో ఉన్న కారణంగా పుట్టింటికి వెళ్లింది. 15 రోజులు గడుస్తున్నా.. భార్య ఇంటికి రాకపోవడంపై భర్త రఫీ ఆగ్రహించాడు... కోప్పడ్డాడు. మనస్తాపానికి గురైన బీబీ జాన్.. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త ఆ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ రఫీ మృతి చెందాడు. ఆ జంటకు ఇద్దరు చిన్నారులున్నారు. వారి మృతితో చిన్నారులు అనాథలయ్యారు.
ఇదీ చూడండి