సోమశిల జలాశయంలో రికార్డు స్థాయిలో నీటిని నిల్వ చేసినట్లు జన వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 74 టీఎంసీల నీరు సోమశిలలో చేరిందన్నారు. గతంలో 73టీఎంసీల నీరు మాత్రమే నిల్వ చేయగా, తాము ప్రస్తుతం 74 టీఎంసీలకు చేర్చామని తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి సామర్థమైన 78 టీఎంసీల నీటి నిల్వకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావడం వల్లే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయని, జలాశయాలన్ని నిండుకుండలా మారాయన్నారు. శ్రీశైలం నుంచి నెల్లూరు జిల్లాకు ఇప్పటివరకు104 టీఎంసీల నీటిని తీసుకు వచ్చినట్లు తెలిపారు. కండలేరు జలాశయానికి పూర్తిస్థాయిలో నీటి విడుదల చేసి, జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
ఇదీ చూడండి: నిండుకుండలా సోమశిల జలాశయం