నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వేసవికి ముందే నీటికష్టాలు మెుదలయ్యాయి. గంగిరెడ్డిపల్లెలో తాగునీటి కోసం జనాలు ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భజలాలు అడుగంటి పోయాయి. కనీస అవసరాలు దేవుడెరుగు... తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నారు. గత్యంతరం లేక గ్రామంలో ఉండే నీటిశుద్ధి కేంద్రం నుంచి వచ్చే వృథా నీటిపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి