సోమశిల నుంచి కండలేరు జలాశయానికి చేస్తున్న నీటి విడుదలను అధికారులు తగ్గించారు. నెల రోజులుగా 10 వేల నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు కండలేరు కాలువ ద్వారా ప్రవహించింది. ఇప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గిన కారణంగా... నీటి విడుదలనూ అధికారులు తగ్గించారు. కండలేరు జలాశయానికి 5 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే అధికారులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కండలేరు జలాశయంలో 46 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: