పామును ఆటో తొక్కిందని...అందుకే అది ఆటో డ్రైవర్ని చంపడానికి పగపట్టి వచ్చిందని మూఢనమ్మకంతో ఆ పామును చంపారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకలపూండ్లలో జరిగింది. ఆటో డ్రైవర్ మోడేగంట పుల్లయ్య ఆటోతో నాగుపాము తొక్కాడు. అది పగతో సుమారు 10కిలోమీటర్ల దూరం వెంబడించిందని స్థానికులు తెలిపారు. అదే ఆటోడ్రైవర్ ఇంటి పక్కన ఉన్న పైపులోకి వెళ్లిందని... బయటకు తీసుకొచ్చేందుకు రాళ్లతో కొట్టారు. అప్పటికీ రాకపోయేసరికి... పైపులో పెట్రోల్ పోసి నిప్పంటించి సర్పాన్ని చంపేశారు. 4 అడుగుల నాగుపాము పగబట్టి వచ్చిందని మూఢ నమ్మకంతో చంపేశారు.
ఇదీచూడండి.సూళ్లూరుపేటలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు