నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన కరోనా క్వారంటైన్ కేంద్రంలో వసతులు లేవని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలోని క్వారంటైన్ విభాగాన్ని శుభ్రం చేయడం లేదని... మాస్కులు ఇవ్వడంలేదని..సరైన భోజనం కూడా లేదని ఆందోళనకు దిగారు. పేరుకే పౌష్టికాహారం ఇస్తున్నామని చెబుతున్నారని... వాస్తవంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
ఇది చదవండి 'తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దు'