అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా విద్యా ప్రమాణాలు మెరుగు పడాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలతో పోల్చుకుంటే విద్యావిధానంలో మనం ఇంకా ఎందుకు వెనుకబడి ఉన్నామో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ 2, 3, 4, 5వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో కలిసి ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. విద్యా సంస్థలు ఫలితాల కోసం కాకుండా విద్యార్థుల మేధస్సు పెంచేలా బోధన ఉండాలని వెంకయ్య అన్నారు. ఎప్పుడో బ్రిటిష్ వారు రాసిన, బోధించిన చరిత్రే కాకుండా, దేశ సంస్కృతి ప్రతిబింబించేలా చరిత్ర ఉండాలన్నారు. ఉద్యోగం కోసమే విద్య నేర్చుకునే పరిస్థితిలో మార్పు రావాలన్నారు. ఉన్నత లక్ష్యంతో కష్టపడి చదువుతూ, అవకాశాలను అందిపుచ్చుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సూచించారు. విద్యార్థుల మేదస్సు సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. ముందుగా యూనివర్సిటీలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు ఉపరాష్ట్రపతి మెడల్స్ అందజేశారు.
ఇదీ చదవండి: