కన్న తల్లిని, మాతృభూమిని, మాతృభాషను మరచిపోకూడదని.. ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం చేపట్టాల్సిన భాషాభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను మర్చిపోకూడదన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా.. మాతృభాషపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం మైసూరులో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని నెల్లూరుకు తరలించిందని తెలిపారు. తెలుగు భాషాభిమానులు, కవులు, రచయితలు, అందరూ తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఇదీ చదవండి: