48 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన హబీబర్ అనే వృద్ధుడు.. ఫేస్బుక్ పుణ్యమా అని తిరిగి తన కుటుంబసభ్యులను కలుసుకున్నాడు. బంగ్లాదేశ్ బజ్గ్రామ్లో ఇనుప కడ్డీలు, సిమెంట్ వ్యాపారం చేసుకునే హబీబర్.. 30 ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం ఇల్లు వదిలి వెళ్లాడు.. అయితే ఏళ్లు గడిచినా.. తిరిగి ఇంటికి రాకపోయేసరికి.. కంగారు పడిన కుటుంబసభ్యలు ఆయన కోసం వెతకని చోటంటూ లేదు. కానీ, ఫలితం మాత్రం లేకపోయింది.
ఒక్క వీడియోతో ఒక్కటయ్యే..
అయితే, ఇటీవల ఓ వృద్ధుడి చికిత్సకు ఆర్థిక సాయం కోరుతూ.. వీడియో పోస్ట్ చేశాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. ఆ వీడియోను చూసిన హబీబర్ పెద్ద కుమారుడి భార్యకు.. ఆ ఆసుపత్రిలో ఉన్నది తన మామయ్యే అయ్యి ఉంటాడని అనుమానం వచ్చింది. వెంటనే ఈ వీడియో గురించి కుటుంబసభ్యలతో పంచుకుంది.
ఈ వీడియో చూసిన హబీబర్ కుమారులు ఆసుపత్రికి వెళ్లారు. ఇంకేముంది హబీబర్ కోడలి అనుమానం నిజమైంది.. చికిత్స పొందుతున్న వ్యక్తి మరెవరో కాదు వారి తండ్రే అని తెలిసింది.
ఇన్నాళ్లు ఏమైపోయావని అడినప్పుడు.. గత 25 ఏళ్లుగా మౌల్విబజార్లోని రాయోస్సరీకి చెందిన రజియా బేగం కుటుంబంతో కలిసి ఉంటున్నట్లు చెప్పాడు హబీబర్. 1995లో హజ్రత్ సాహబుద్దీన్ తీర్థంలో హబీబర్ తమ కుటుంబాన్ని కలిశాడనీ, అతడిని తాము పీర్ అని పిలుస్తూ గౌరవంగా చూసుకుంటామని తెలిపింది రజియా.
ఏదైతేనేం... దాదాపు అర్ధ శతాబ్దం తరువాత ఇల్లు వదిలి వెళ్లిపోయిన తండ్రి వృద్ధాప్యంలో మళ్లీ కలిసినందుకు ఎంతో సంతోషించారు హబీబర్ కుమారులు. ప్రస్తుతం ఆయనను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.
'మా అమ్మ, మామయ్యలు నాన్నను వెతికేందుకు ఎంతగా ప్రయత్నించారో నాకు ఇంకా గుర్తుంది. మా అమ్మ 20 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఇప్పుడు మా నాన్న కలిశాడు' అంటూ కంటతడి పెట్టుకున్నారు ఆ సోదరులు.
ఇదీ చదవండి: ఇట్లు.. మీ షాపులో చోరీకి యత్నించిన దొంగ!