నెల్లూరు జిల్లా వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ కార్యక్రమం ఏర్పాట్లను వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి పర్యవేక్షించారు. అమ్మవారి జాతరను భక్తి శ్రద్దలతో లాంఛనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధలతో ఆలయ అధికారులు జాతరను జరింపించారు. పూల అలంకరణ, విద్యుత్ దీపాలంకరణ, లక్ష కుంకుమార్చనతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో ఆఖరి ఘట్టమైన ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ,ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీలు వాకాటి నారయణ రెడ్డి, బల్లి కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నెల్లూరు: గుప్త నిధుల తవ్వకాల్లో విభేధాలు.. దారుణ హత్య