Varla Ramaiah: దేశానికి స్వాసంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. మన రాష్ట్రంలో అంటరానితనం, కులవివక్షత ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కోట సర్పంచ్ రమణమ్మది తక్కువ కులమంటూ అవమానించటం దారుణమన్నారు. పంచాయతీ కార్యాలయంలోని తన రూమ్‌లో సర్పంచ్‌ను కూర్చోనివ్వకపోటం శిక్షార్హమన్నారు. ఆమె విధి నిర్వహణ చేయకుండా అడ్డుకోవటం, అధికారులు కూడా చూస్తూ మిన్నకుండిపోవటం సరైంది కాదన్నారు. ఈ విషయంపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు వర్ల రామయ్య లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఏం జరిగిందంటే..
ఎస్టీ మహిళ కావడంతో అధికారులు తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని నెల్లూరు జిల్లా కోట సర్పంచ్ వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసిన ఆమె.. ఈఓ పీఆర్డీ స్వరూపారాణి చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పనుల గురించి కనీస సమాచారం ఇవ్వడం లేదన్నారు. అన్ని పనులు ఆమెనే చేసి తనను మాత్రం కేవలం ఫొటోల కోసం పిలుస్తున్నారని ఆవేదన చెందారు. పంచాయతీ కార్యాలయంలో తనకు సరైన గది సైతం కేటాయించలేదని సర్పంచ్ వాపోయారు.
ఇదీ చదవండి :
Woman Sarpanch: కనీస గౌరవం ఇవ్వడం లేదు.. మహిళా సర్పంచ్ ఆవేదన