నెల్లూరు జిల్లాలో మట్టిమాఫియాను అడ్డుకున్న ఎస్సీ యువకుడు మల్లికార్జున్‌పై వైకాపా నేతలు దాడి చేయటంతో పాటు పోలీసులు బాధితునిపై కేసు నమోదు చేయటంపై తెదేపా నేత వర్ల రామయ్య(varla ramaiah) మండిపడ్డారు. ఈ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు (NHRC) ఫిర్యాదు చేశారు. మల్లికార్జున్‌పై అక్రమ కేసులు ఎత్తివేయటంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ ఛైర్మన్‌ను కోరారు. జూన్ 16న ద్విచక్రవాహనంపై వెళ్తున్న మల్లికార్జున్‌ను అడ్డగించి వైకాపా నేతలు దాడి చేశారన్నారు. అదే రోజు రాత్రి బాధితుడిపై కొడవలూరు పోలీస్టేషన్లో తప్పుడు కేసు పెట్టించారన్నారు. రాష్ట్రానికి తక్షణమే ఓ ప్రత్యేక బృందాన్ని పంపి మల్లికార్జున్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎన్హెచ్ఆర్సీని (NHRC) విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఎస్సీల ప్రాథమిక హక్కులు హరించేలా తరచూ వివిధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. గత రెండేళ్లలో ఎస్సీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలపై అనేక ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఫలితమూ లేదన్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కే చర్యలు రాష్ట్రంలో సర్వసాధారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటవిక పాలనను తలిపించే ఈ చర్యలను నివారించాల్సిన బాధ్యత మానవ హక్కుల కమిషన్‌పై ఉందని పేర్కొన్నారు. శాసనమండలిలో మెజారిటీ తక్కువ ఉన్నప్పుడు మండలి రద్దు తీర్మానం చేసి ఇప్పుడు బలం పెరిగాక స్వాగతించటం సీఎం జగన్ (cm jagan) అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎస్సీలు తన బంధువులన్న జగన్..వారిపై దాడులు చేస్తే మాత్రం స్పందించటం లేదని ధ్వజమెత్తారు.
ఇదీచదవండి