ETV Bharat / state

V-EPIQ theatre: రామ్ చరణ్ ప్రారంభించిన.. ఆసియాలోనే అతిపెద్ద సినిమా థియేటర్​ మూసివేత..! - nellore district latest updates

Nellore V-EPIQ theatre close: సూళ్లూరుపేట సమీపంలోని వి-ఎపిక్ అనే మల్టీప్లెక్స్ థియేటర్​ను.. యాజమాన్యం ఇవాళ మూసివేసింది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించడంతో.. ఈ నిర్ణయం తీసుకుంది.

సుళ్లూరుపేటలో వీ-ఏపిక్ థియేటర్​ను మూసేసిన యాజమాన్యం

author img

By

Published : Dec 25, 2021, 2:17 PM IST

Updated : Dec 25, 2021, 5:23 PM IST

V-EPIQ theatre: సినిమా టికెట్లపై ప్రభుత్వ వైఖరి, థియేటర్లలో అధికారుల తనిఖీలను నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల స్వచ్చంధంగా సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. గత రెండు రోజులుగా అనేక సినిమా హాళ్లను మూసివేశారు.

ఈ క్రమంలో.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వి-ఎపిక్ మల్టీప్లెక్స్ థియేటర్​ను​ ఇవాళ యాజమాన్యం మూసివేసింది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలు తగ్గించడంతో.. అ ధరలు తమకు గిట్టుబాటు కావంటూ థియేటర్​ను మూసివేశారు.

ఈ థియేటర్ ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్క్రీన్ కలిగినది కావడం గమనార్హం. ఈ థియేటర్లోని స్క్రీన్ 100 అడుగుల పొడవు.. 56 అడుగుల వెడల్పుతో ఉంటుంది. 2019 ఆగస్టు 30న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ థియేటర్ ను ప్రారంభించారు. ఇవాళ (శనివారం) ఉదయం ఆట నుంచే టాకీసును మూసేశారు.

ఈ థియేటర్​ సీటింగ్ కెపాసిటీ 646 సీట్లు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని నిర్మించారు. ఈ థియేటర్ ప్రాంగణంలో మరో రెండు సినిమా హాళ్లుకూడా ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన సినిమా టికెట్ల ధరలు అత్యల్పంగా ఉన్నాయంటూ వీటిని మూసేశారు.

ఇదీ చదవండి:

Christmas Celebrations: పులివెందులలో సీఎం జగన్​ క్రిస్మస్​ ప్రార్థనలు

Last Updated : Dec 25, 2021, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.