నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పారిశుద్ధ్య సిబ్బందికి దాతల సహాయంతో ఆర్డీవో యూనిఫాం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని ఆర్డీవో ప్రశంసించారు. వీరి సేవను గుర్తించిన దాతలు నలిశెట్టి శీనయ్య లక్ష రూపాయలు, నారాయణరెడ్డి రూ.25 వేలు, సుబ్బారావు రూ.20 వేలు, చైతన్య పాఠశాల అధినేత భాస్కర్ రెడ్డి రూ.10 వేలు, ఆత్మకూరు పురపాలక కార్యాలయం సిబ్బంది రూ.50 వేలు ఇచ్చారన్నారు.
ఇవీ చదవండి...