ఇవీ చూడండి.
చిల్లర నాణేలతో ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి నామినేషన్ - ఉదయగిరి
అసలే ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజు. నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు భారీగా తరలి వచ్చారు. దీంతో అధికారులకు చేతినిండా పని. ఇది సరిపోనట్లు నామినేషన్ దాఖలుకు చెల్లించే 10వేల నగదును నాణేల రూపంలో సమర్పించి మరి కాస్త పని కల్పించాడు ఉదయగిరి ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ రావు.
నామినేషన్ దాఖలు రుసుము 10వేలను చిల్లర రూపంలో సమర్పించిన మధుసూదన్ రావు
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వినూత్న రీతిలో నామినేషన్ దాఖలు చేశారు. వీరారెడి పాలెంకు చెందిన అభ్యర్థి మధుసూదన రావు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. అనంతరం నామినేషన్ దాఖలుకు చెల్లించే 10వేల నగదును కేవలం నాణేల రూపంలో సమర్పించాడు. వాటిని ఐదుగురు సిబ్బంది కష్టపడి లెక్కించారు. ఈ తంతును అక్కడికి వచ్చిన వారు ఓ వింతగా చూశారు.
ఇవీ చూడండి.
Nagaur (Rajasthan), Mar 25 (ANI): The mortal remains of Army jawan Hari Bhakar were brought to his village in Rajasthan's Nagaur on Monday. Grenadier Hari Bhakar lost his life in ceasefire violation in Poonch district of Jammu and Kashmir on March 24. Family members and neighbors paid their last respect to the slain solider.