Two Bhavani devotees died in a road accident: నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని సున్నపుబట్టి వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోవూరు మండలంలోని చంద్రమౌళి నగర్ నుంచి స్వగ్రామం అల్లూరు సింగపేట గ్రామం చెలిక సంగం వెళ్తున్న భవానీల ఆటోను వెనక నుంచి కంటైనర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. చికిత్స పొందుతూ వరదయ్య మృతి చెందారు. ఐదుగురికి స్వల్ప గాయాలు కావడంతో.. కావలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో ఐదుగురు చిన్నారులతో సహా 18 ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న దగదర్తి పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. కోవూరులో భజన కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: