నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాశిలి వద్ద ట్రాక్టర్ డ్రైవర్ వీరంగం సృష్టించాడు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ మద్యం మత్తులో ట్రాక్టర్ దురుసుగా నడిపాడు. అతివేగంతో ఓ ఇంట్లోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో నారాయణమ్మ (40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు