ETV Bharat / state

బీహార్​కు బయలుదేరిన మూడో రైలు

నెల్లూరు జిల్లాలో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు మరో రైలు బయలుదేరింది. ఇప్పటికే జిల్లా నుంచి రెండు రైళ్లు బీహార్​కు వెళ్లగా, మూడో రైలును ఇప్పుడు పంపించారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు స్వగ్రామాలకు వెళ్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Bihar_Maro_Railu
Bihar_Maro_Railu
author img

By

Published : May 18, 2020, 11:29 AM IST

వలస కార్మికులను వారి వారి స్వరాష్ట్రాలకు తరలించేందుకు నెల్లూరు నుంచి మరో ప్రత్యేక రైలు బీహార్​కు బయలు దేరింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న 1401 మంది వలస కార్మికులను 32 ఆర్టీసీ బస్సుల్లో నెల్లూరు రైల్వే స్టేషన్​కు తరలించారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల తర్వాతే కార్మికులను రైలులోకి అనుమతించారు.

జాయింట్ కలెక్టర్ కమల కుమారి తోపాటు పలువురు అధికారులు ఈ రైలును ప్రారంభించారు. ఇప్పటికే జిల్లా నుంచి రెండు రైళ్లు బీహార్​కు వెళ్లగా, మూడో రైలును ఇప్పుడు పంపించారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు స్వగ్రామాలకు వెళ్తుండడంపై ఆనందించారు.

ఇవీ చూడండి:

పాపతో పనిచేయించడం... వారికి పాపమని అనిపించలే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.