ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్తతో నెల్లూరు శోకసంద్రంలో మునిగిపోయింది. నగరంలోని బాలు స్వగృహం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాలు తిరిగి వస్తారని ఎంతో ఆశగా ఎదురుచూశామని... ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లటం దిగ్భ్రాంతికి గురిచేసిందంటున్నారు. స్వగృహనికి ఎప్పుడు వచ్చినా... తమను అప్యాయంగా పలకరించే వారని గుర్తుచేసుకున్నారు.
ఇదీచదవండి