Trafficking Earthworms అక్రమంగా రవాణా చేస్తున్న వానపాములను నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 19 కిలోల వానపాములను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వానపాములను తరలిస్తున్న కారును సీజ్ చేశారు. కోవూరు జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నుంచి కావలి వైపు వెలుతున్న ఓ కారులో వానపాముల అక్రమ రవాణా బయటపడింది. సూళ్లూరుపేట షార్ సర్కిల్ కు చెందిన చక్రవర్తి, డి. కళ్యాణ్, ఏ. కళ్యాణ్ లను పోలీసులు అరెస్టు చేసిన పోలీసులు, వారిని అటవీ అధికారులకు అప్పగించారు.
ఇవీ చదవండి