Traffic jam on Gudur National Highway: నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో జాతీయ రహదారిపై వరద ప్రవాహానికి వాహనాలు ముందుకు సాగడం లేదు. జాతీయ రహదారి పరిస్థితిని కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. వరద కారణంగా ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్‌ను పరిశీలించారు. కలెక్టర్ చక్రధర్ బాబు, ఎమ్మెల్యే వరప్రసాద్‌తో కలసి వరద నీటిలో లారీలో ప్రయాణం చేశారు. మూడు వారాలుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వాగులు ,వంకలు ,చెరువులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని కలెక్టర్ అన్నారు. జాతీయ రహదారిపై వరద కారణంగా ఏర్పడ్డ ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారికి ఆహారం, తాగునీరు అందిస్తున్నామన్నారు. జిల్లాలో వరద కారణంగా లోతట్టు ప్రాంతాలకు చెందిన సుమారు 4800 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: NITI AAYOG: వీరపనేనిగూడెంలో నీతి ఆయోగ్ బృందం పర్యటన