నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నివర్ తుపానుతో గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోట - సూళ్లూరుపేట మార్గంలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు పారుతున్నాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతూ ముందుకు సాగారు.
వర్షానికి నీటిలో మునిగిన వరి పంటను అధికారులు పరిశీలించారు. తడ మండలం కారిజాత గ్రామంలో చెరువుకు గండి పడే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పోలాల్లో వెళ్లి పరిశీలించారు. రైతులు చెరువు తెగకుండా ఇసుక బస్తాలు వేసి కాపాడుకుంటున్నారు.