తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు కలెక్టర్ చక్రధర్‌బాబుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు వీఆర్సీ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, గౌతంరెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితోపాటు.. పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో వైకాపా కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఇదీ చదవండి: రెెండు బస్సులు, ఒక లారీ ఢీ.. నలుగురు మృతి