ద్విచక్రవాహనం బోల్తా...ముగ్గురు మృతి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు మృతిచెందిన ముగ్గురు అబ్దుల్ అబీజ్, అశోక్, అప్సర్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : కావలిలో అక్రమ దుకాణాలు కూల్చివేత