స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా బెదిరింపులకు దిగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఇందుకు పోలీసులు సైతం సహకరిస్తూ.. నామినేషన్లు ఉపసంహరణ చేసుకోవాలని ప్రతిపక్ష అభ్యర్థులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. పొదలకూరు, మనుబోలు పోలీసుల ఫోన్ కాల్ డేటాను ఎన్నికల అధికారులు పరిశీలిస్తే విషయం అర్థమవుతుందని అన్నారు. గతంలో ఎలాంటి నేరచరిత్ర లేని వారిని సైతం బైండోవర్ పేరుతో స్టేషన్‌కు పిలిపిస్తున్నారన్నారు. అరాచకం సృష్టించైనా.. ఎన్నికల్లో గెలవాలని వైకాపా ప్రయత్నిస్తోందని నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. తమ అభ్యర్థులను బెదిరించడం, కిడ్నాప్‌లు చేయడం చేస్తున్నా.. పోలీసులు స్పందించడం లేదన్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పరిస్థితిపై హోంమంత్రికి భాజపా ఎంపీల లేఖ