ETV Bharat / state

డబ్బు దోచుకెళ్లి... దుకాణానికి నిప్పు పెట్టి!

author img

By

Published : Mar 28, 2020, 5:53 PM IST

ఆత్మకూరు పట్టణంలోని ఓ దుకాణంలో చోరీ జరిగింది. దుండగుడు నగదు దొంగిలించడమే కాకుండా దుకాణంలోని బల్లకు నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. మంటలను అదుపు చేశాక చోరి జరిగిన విషయాన్ని గుర్తించాడు దుకాణ యజమాని.

Theft took place in an oil shop in Atmakur

ఆత్మకూరులోని నూనె దుకాణంలో చోరీ

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని నూనె విక్రయించే హోల్​సేల్ దుకాణంలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. దాదాపు లక్ష రూపాయల నగదు అపహరణకు గురైంది. బాత్రూం స్లాబు గోడ పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగుడు.... డబ్బులు దోచుకున్న అనంతరం దుకాణంలోకి బల్లకు నిప్పు పెట్టాడు. స్థానికులు మంటను గుర్తించి దుకాణ యజమానికి తెలిపారు. దుకాణ యజమాని గ్రంధి వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక దళానికి సమాచారం ఇవ్వటంతో వారు మంటలను అదుపు చేశారు. క్యాష్ కౌంటర్​లో ఉండాల్సిన లక్ష రూపాయల నగదు, ఒక లక్ష రూపాయలకు సంబంధించిన లావాదేవీల వివరాలు కనబడకపోవటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంటలు నూనె నిల్వ చేసిన గదిలోకి వ్యాపించి ఉంటే భారీ స్థాయిలో అగ్నిప్రమాదం సంభవించి లక్షల్లో ఆస్తి నష్టం సంభవించేదని బాధితుడు గ్రంధి వెంకటేశ్వర్లు తెలిపారు. ఘటనపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'భార్యతో అసభ్య ప్రవర్తన.. తండ్రిని చంపిన కుమారుడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.