శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఫిబ్రవరిలో పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)- సి51 వాహకనౌక ద్వారా యూనిటీ శాట్ ఉపగ్రహాన్ని పంపనున్నారు. ఈ ఉపగ్రహం పనితీరు, డేటా సేకరణ తదితరాలను పర్యవేక్షించేందుకు గురువారం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి ఆన్‌లైన్ విధానంలో 3 చోట్ల గ్రౌండ్ స్టేషన్లను ఇస్రో అధిపతి డాక్టర్ శివన్ ప్రారంభించారు. వాటి పనితీరును పరిశీలించారు.
తమిళనాడులోని శ్రీపెరంబుదూరుకు చెందిన జెప్పియార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జెట్సాట్), నాగ్‌పూర్‌కు చెందిన జీహెచ్ రైసోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (జీహెచ్‌ఆర్‌సీఈ), కోయంబత్తూర్‌లోని శ్రీశక్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ సంయుక్తంగా ఈ యూనిటీ శాట్ ఉప్రగహాన్ని రూపొందించాయి. ఈ ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించడాన్ని పర్యవేక్షించేందుకు చెన్నై, నాగ్‌పూర్, కోయంబత్తూరులో గ్రౌండ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:
చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయి?..యువతకు ఓటుహక్కు పిటిషన్‌పై హైకోర్టు