ETV Bharat / state

"ఇళ్లు కూల్చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు" - demolish

"30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. కనీస సమాచారం ఇవ్వకుండా కూల్చేశారు." అంటూ కన్నీటి పర్యంతమయ్యారు బాలకృష్ణారెడ్డి నగర్ వాసులు. ఎస్సీ, బీసీ కమిషన్ సభ్యుల ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. అధికారుల తీరుపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కమిషన్ సభ్యులు
author img

By

Published : Jul 27, 2019, 4:07 AM IST

"పేదల ఇళ్లు కూల్చివేస్తుంటే ఏం చేస్తున్నారు?''
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో బాలకృష్ణ రెడ్డి నగర్​లో జాతీయ ఎస్సీ, బీసీ కమిషన్ సభ్యులు సందర్శించారు. ఇటీవలే అక్కడి ఇళ్లు కూల్చేయడంతో బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు దగ్గరుండి ఇళ్లు కూల్చడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ శ్రీధర్​ను దీనిపై ప్రశ్నించారు. ఈ విషయం తమకు సంబంధం లేనిదని.. ప్రైవేట్ వ్యక్తులు ఈ పనిచేశారని సబ్ కలెక్టర్ బదులిచ్చారు. పేదలను ఖాళీ చేయించిన స్థలం ప్రైవేటుదా, ప్రభుత్వానిదా తేల్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎవరైనా నకిలీ పత్రాలతో అమ్ముకుంటే వారిపై చర్యలు తీసుకునే అధికారం రెవెన్యూ, పోలీసులకు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్థలం ఎవరిదనే వివరాలు అధికారులు తెలియజేయాలని ఆదేశించారు. పేదల ఇళ్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చి చేయడాన్ని తప్పుబట్టారు. ప్రైవేట్ స్థలం అని తెలిసినా పేదలు ఇళ్లు కట్టుకుంటుంటే అధికారులు ఎందుకు చూస్తూ ఉండిపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు ఇళ్లు కూల్చి వేస్తే మళ్లీ కట్టుకునేందుకు వారికి డబ్బులు ఎలా వస్తాయని నిలదీశారు. దీనిపై చాలా లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బాధితుల ఇళ్లు కూల్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కావలి డీఎస్పీకి సూచించారు.

New Delhi, July 26 (ANI): Samajwadi Party MP Azam Khan on June 25 caused uproar with his remarks on BJP member Rama Devi, who was in the chair, during the debate on the Triple Talaq Bill. The BJP members felt that the remark was inappropriate. While speaking to ANI, Rama Devi on Azam Khan's remark on her said, "He has never respected women. We all know what he had said about Jaya Prada ji. He has no right to stay in Lok Sabha. I will request Speaker to dismiss him. Azam Khan must apologise."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.