నెల్లూరు నగరంలోని బాలాజీనగర్లో గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. చేతుల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు 2008 అక్టోబర్ 15వ తేదీ నుంచి అన్ని దేశాలలో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. భోజనం చేసే ముందు, తర్వాత ప్రతి ఒక్కరూ తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. చేతులు పరిశుభ్రత వల్ల కొవిడ్ తోపాటు ఇతర అనారోగ్యాల బారిన పడకుండా ఉండోచ్చన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు చిన్నప్పటి నుంచే చేతులు శుభ్రం చేసుకోవటంపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఇదీ చదవండీ...'లోక్పాల్ ఆదేశాలను సమీక్షించే అధికారం లేదు'