ETV Bharat / state

'కరోనా వ్యాప్తి చెందకుండా కాపాడండి' - carona prevenive measures

ఆత్మకూరు మండలంలోని దళిత మహిళలు తమ గ్రామంలో ఇసుక రీచ్ లో కార్యకలాపాలను అడ్డుకున్నారు. కరోనా నుంి తమ ప్రాణాలను కాపాడాలని ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.

nellore  district
అప్పారావు పాలెం గ్రామస్థుల నిరసన
author img

By

Published : May 11, 2020, 7:41 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో లాక్ డౌన్ ముగిసేవరకు తమ గ్రామంలో ఇసుక రీచ్ ను ఆపి తమ ప్రాణాలను కాపాడాలని అప్పారావు పాలెం గ్రామ దళితులు మహిళలు ఆర్డిఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. సుదూర ప్రాంతాల నుంచి తమ ప్రాంతానికి ఇసుక కోసం లారీలు, టిప్పర్లు వస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. సదరు వాహన డ్రైవర్లు సిబ్బంది ద్వారా తమకు కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు.

అధికారులకు తమ ఆవేదన తెలియజేసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇసుక రీచ్ ను ఆపేందుకు ఆర్డీఓ సమ్మతించని కారణంగా.. మహిళలు ఆర్డీవో ఉమాదేవి తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇసుకను తరలించే లారీ డ్రైవర్లు సిబ్బంది ద్వారా తమ గ్రామంలో కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఇదీ చదవండి:

మైపాడు బాలాజీ కెమికల్స్​లో అగ్ని ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.