ప్రకాశం జిల్లా గిద్దలూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల జానపద నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కర్నూలులోని మాంటిస్సోరీ పాఠశాలలో మాతృభాష దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈనెల 22న శివరాత్రి సందర్భంగా సెలవు రావడం వల్ల మాతృభాష వేడుకలను ముందుగానే చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరిస్తూ విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: