నెల్లూరు జిల్లాలో సాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ జలాలు విడుదల చేశారు. కండలేరు జలాశయం నుంచి సాయిగంగ ప్రధాన కాలువ ద్వారా 2ఏ, 2బీ, 3, 4 ఉప కాలువలకు, బాలాయపల్లి మండలం ఊట్లపల్లి గ్రామ సమీపంలోని ఐదో బ్రాంచి కాలువకు నీరు విడుదల చేశారు. వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలో వందలాది చెరువులకు ఈ నీరు అందుతుందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. ప్రస్తుతం కండలేరు జలాశయంలో 35 టీఎంసీల నీరు ఉందని... ఇప్పటినుంచి సోమశిల నుంచి ఈ జలాశయానికి 10,500 క్యూసెక్కుల నీరు చేరుతుందని చెప్పారు. ప్రస్తుతం వస్తున్న నీటిని సాగు అవసరాలకు వినియోగించుకోవాలి సూచించారు.
ఇదీ చదవండి: నెల్లూరు అగ్నిప్రమాద ఘటనలో అదుపులోకి వచ్చిన మంటలు