ETV Bharat / state

నెల్లూరు పౌరసరఫరాల సంస్థలో వెయ్యికోట్ల అవినీతి: తెదేపా నేత సోమిరెడ్డి

Somireddy Chandramohan Reddy: నెల్లూరు పౌరసరఫరాల సంస్థలో వెయ్యికోట్ల అవినీతి జరిగిందని తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు నగదు చెల్లించటంలో జరిగిన జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Somireddy Chandramohan Reddy
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
author img

By

Published : Nov 2, 2022, 11:00 AM IST

Updated : Nov 2, 2022, 11:12 AM IST

Somireddy Chandramohan Reddy: నెల్లూరు పౌరసరఫరాల సంస్థలో వెయ్యికోట్ల అవినీతి చోటుచేసుకుందని దీనిపై తక్షణం సీబీఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఒకవైపు రైతులకు ధాన్యం డబ్బులు.. చెల్లించకపోగా మరోవైపు మిల్లర్ల నుంచి తీసుకున్న బియ్యాన్ని మాయం చేశారని ఆయన మండిపడ్డారు. ఈ భారీ కుంభకోణం వెనక ఉన్న పెద్దలు ఎవరనేది తేల్చాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఉలవపాడు మండలానికి చెందిన రైతులు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ఎదుట బైఠాయించి.. ధాన్యం బకాయిలు చెల్లించాలని కోరడాన్ని బట్టి రైతుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. ధాన్యం కోనుగోలు చేసిన వారం తర్వాత చెల్లిస్తామన్న డబ్బులు ఇంతవరకు రాకపోవటాన్ని ప్రశ్నించారు.

తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

ఇవీ చదవండి:

Last Updated : Nov 2, 2022, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.