సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెదేపా నేత, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ విమర్శించారు. తెదేపా నేతల అరెస్టులు నిరసిస్తూ నెల్లూరు తెదేపా కార్యాలయంలో బీసీ సంఘాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన తీరు బాధాకరమని అజీజ్ విచారం వ్యక్తం చేశారు. బీసీలను అణిచివేసేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందన్నారు.
అక్రమంగా అరెస్టు చేసిన తెదేపా నేతలను విడుదల చేసే వరకు తాము నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని అబ్దుల్ అజీజ్ అన్నారు.
ఇదీ చదవండి: కుక్కర్లో తల ఇరుక్కుపోయి.. తల్లడిల్లిన చిన్నారి