నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘ సమావేశం వాడివేడిగా సాగింది. ప్రారంభంలో ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని మునిసిపల్ ఛైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్ ఛైర్మన్ రాజేశ్వరావు మాట్లాడుతూ... తెదేపా నుంచి మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నికైన శారద... వైకాపాలోకి చేరిన కారణంగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ జగన్ అభిమతం ఇదేనన్నారు.
వెంకటగిరిలో తెదేపా నుంచి గెలిచిన శారద వైకపాలోకి వెళ్లి పదవిలో కొనసాగడం ఏమిటనే ప్రశ్నకు... వైకాపా కౌన్సిలర్ కళ్యాణి సమాధానం ఇస్తుండగా... తెదేపా సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. చివరికి ఏడుగురు సభ్యులతో సమావేశం జరిగింది.
ఇదీ చదవండి