ETV Bharat / state

108 వాహనాల కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగింది: తెదేపా నేతలు - వైకాపాపై తెదేపా నేతల మండిపాటు

రాష్ట్రంలో 108 వాహనాల కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగిందని తెదేపా నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని... వైకాపా నాయకుల అవినీతి, అక్రమాలను విమర్శించే, ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

tdp leaders fires on ycp in 108 vehicles contract issue at nellore
108 వాహనాల కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగిందన్న తెదేపా నేతలు
author img

By

Published : Jul 2, 2020, 6:42 PM IST

రాష్ట్రంలో 108 వాహనాల కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అసలు ఒప్పంద గడువు పూర్తి కాకముందే మరో సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటో బయటపెట్టాలని తేదేపా నేతలు నెల్లూరులో డిమాండ్ చేశారు.

108 వాహనాల కాంట్రాక్టులో దాదాపు రూ.307 కోట్ల అవినీతికి పాల్పడి, ఏదో ఘనకార్యం చేసినట్లు జెండా ఊపి కుయి కుయ్ అంటూ గోల చేశారని నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ విమర్శించారు. రివర్స్ టెండరింగ్​తో కోట్ల రూపాయలు ఆదా చేశామని చెప్పే ప్రజాప్రతినిధులకు, ఇప్పుడు రివర్స్ టెండరింగ్ గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. వైకాపా నాయకుల అవినీతి, అక్రమాలను విమర్శించే ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై ఇప్పటికే 18 కేసులు పెట్టారని, ఇంకా ఎన్ని కేసులు పెట్టుకున్నా వైకాపా దుర్మార్గాలను బయటపెడుతూనే ఉంటామన్నారు.

ఇదీ చదవండి:

'సామాన్యులకు సేవ చేసేందుకే సీఎం జగన్ ఉన్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.