కరోనా నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవటంలేదని నెల్లూరు కార్పొరేషన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ విమర్శించారు. లాక్డౌన్ను కర్ఫ్యూలా పాటిస్తున్నారే తప్ప వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. లాక్డౌన్ ఎత్తేయాలన్న ఉత్సాహం ప్రజలకు కరోనా పరీక్షలు చేయటంలో లేదని మండిపడ్డారు.
జిల్లాలో 35 లక్షల జనాభా ఉంటే..కేవలం 18 వేల మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారన్నారు. లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన పేదలను ఆదుకోవటంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.