ETV Bharat / state

గౌతమ్ రెడ్డి సమర్థంగా పని చేశారు.. ఆయన ఆకస్మిక మరణం బాధాకరం - చంద్రబాబు

Mekapati Goutham Reddy Passed Away: రాష్ట్ర ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటురావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. గౌతమ్‌రెడ్డి చనిపోయినట్లు 9.16గంటలకు అపోలో వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఆయన మృతిపై తెదేపా అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు నివాళులు అర్పించారు.

AP Minister Mekapati Gowtham Reddy
AP Minister Mekapati Gowtham Reddy
author img

By

Published : Feb 21, 2022, 3:53 PM IST

Mekapati Goutham Reddy Passed Away: మంత్రి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణం చాలా బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ఉదయం గుండెపోటుతో చనిపోయిన గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన.. మంత్రి పార్థివదేహానికి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటికి వెళ్లి గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తెల్లవారుజాము వరకు ఆరోగ్యంగా ఉండి జిమ్‌కు వెళ్తున్న సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో గౌతమ్‌రెడ్డిని అపోలోకు తరలించారన్నారు. ఆస్పత్రికి వెళ్లే సరికే శ్వాస ఆడని పరిస్థితి నుంచి హఠాన్మరణం చెందడం విచారకరమని చెప్పారు.

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ నేత మేకపాటి గౌతమ్‌ రెడ్డి గారి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/zyZZuVBgLe

    — N Chandrababu Naidu (@ncbn) February 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గౌతమ్‌రెడ్డి ఇటీవల దుబాయ్‌లో పర్యటనకు సంబంధించి టీవీలో వార్తలు చూసినట్లు చంద్రబాబు తెలిపారు. గౌతమ్‌రెడ్డి వివాదాల జోలికి పోకుండా హుందాగా, సమర్థంగా పని చేశారని కొనియాడారు.గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని.. ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

  • మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో తీవ్ర దిగ్ర్భాంతికి గుర‌య్యాను. ఫిట్నెస్‌కి అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చే మంత్రి గారికి గుండెపోటు రావ‌డం అత్యంత విచార‌క‌రం. విదేశాల‌లో ఉన్న‌త‌ విద్యాభ్యాసం చేసి వ‌చ్చినా విన‌యం, విధేయ‌త‌లు ఆయ‌న చిరునామా.(1/2) pic.twitter.com/aHTOZ9RCT4

    — Lokesh Nara (@naralokesh) February 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వినయం.. విధేయతల చిరునామా - లోకేశ్
గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తికి గుండెపోటు రావడంపై విచారం వ్యక్తం చేశారు. విన‌యం, విధేయ‌త‌లు ఆయ‌న చిరునామా అని.. ఐదుప‌దుల వ‌య‌స్సులోనే హుందా గ‌ల వ్యక్తి అంటూ కొనియాడారా.

దురదృష్టకరం - ఎమ్మెల్యే బాలకృష్ణ
రాజకీయాల్లో గౌతమ్‌రెడ్డి అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచి పేరుతెచ్చుకున్నారని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇలాంటి నవతరం నాయకుడిని చిన్నతనంలోనే కోల్పోవడం దురదృష్టకరమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

మచ్చలేని మంత్రి - సోమిరెడ్డి
మంత్రి గౌతమ్ రెడ్డి ఇకలేరన్న వార్త తనను చాలా బాధించిందని తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చిన్నవయస్సులోనే చనిపోవడం బాధాకమన్నారు. గౌతమ్ రెడ్డి తనకు బంధువని.. బంధువుల నిశ్చితార్థ కార్యక్రమంలో రాత్రే కలిశానని చెప్పారు. గౌతమ్ రెడ్డి వివాదరహితుడని.. మచ్చలేని మంత్రిగా పనిచేశారన్నారు.

షాకింగ్​గా ఉంది - ఎంపీ గల్లా
మంత్రి గౌతమ్‌రెడ్డి ఇకలేరనే విషయం చాలా షాకింగ్‌గా ఉందని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. ఆయనతో తనకు 30 ఏళ్ల అనుబంధముందని చెప్పారు. తాము రాజకీయాల్లోకి తమ కుటుంబాలు మంచి సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పారు. యువ నేతలకు గౌతమ్‌ స్ఫూర్తిగా ఉండేవారని జయదేవ్‌ అన్నారు.

గౌతమ్ రెడ్డి మృతి బాధాకరం - సీపీఎం, సీపీఐ
మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే గౌతమ్ రెడ్డి హఠాన్మరణం బాధాకరమని చెప్పారు. మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కూడా సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

గౌతమ్ రెడ్డి మృతి.. ఏం జరిగిందంటే..?
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. గౌతమ్‌ రెడ్డి ఇంటి వద్ద కుప్పకూలడంతో ఉదయం 7.45గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. స్పందించని స్థితిలో మంత్రి ఆస్పత్రికి వచ్చారన్నారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్‌రెడ్డికి శ్వాస ఆడట్లేదని వైద్యులు తెలిపారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అనంతరం గౌతమ్‌రెడ్డి చనిపోయినట్లు 9.16గంటలకు అపోలో వైద్యులు ప్రకటన విడుదల చేశారు.

గౌతమ్‌రెడ్డి రాష్ట్ర ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్‌ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం నిన్ననే హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీకి ఆది నుంచి బలమైన మద్దతుదారుగా ఉన్న పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడు గౌతమ్‌ రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున ఆయన విజయం సాధించారు.

గౌతమ్‌రెడ్డి తొలిసారిగా 2014లో ఆనం రామనారాయణ రెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో జిల్లాలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నాయకుడిగా గౌతమ్‌ రికార్డు సృష్టించారు. 2019లో రెండో పర్యాయం ఆయన బొల్లినేని కృష్ణయ్యపై విజయం సాధించి కేబినెట్‌ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. గత నెల 22వ తేదీన మేకపాటి గౌతమ్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. అప్పట్లో స్వల్పలక్షణాలు ఉండటంతో చికిత్స పొంది కోలుకొన్నారు.

మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రొఫైల్‌..

  • తల్లిదండ్రులు: మేకపాటి రాజమోహన్‌ రెడ్డి-మణిమంజరి
  • పుట్టిన తేదీ: 2-11-1971
  • విద్య: హైదరాబాద్‌ భద్రుకా కాలేజ్‌లో గ్రాడ్యూషన్‌, యూకేలో ఎమ్మెస్సీ టెక్స్‌టైల్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు.
  • వ్యాపారం: 1997లో కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్‌లో వ్యాపార జీవితం మొదలుపెట్టారు.
  • రాజకీయ రంగ ప్రవేశం: 2014లో ఆత్మకూర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
  • భార్య : మేకపాటి శ్రీకీర్తి
  • పిల్లలు: ఒక కుమార్తె, ఒక కుమారుడు
  • బాబాయ్‌: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మెల్యే)

ఇదీ చదవండి

Gowtham Reddy No More: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత.. ఎల్లుండి అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.