కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉన్నందున రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు. అసుపత్రుల్లో పడకలు లభించక.. కరోనా రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సౌకర్యాలు లేక ఎంతో మంది కరోనా బాధితులు మృత్యువాత పడుతున్నారని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు హడావుడి చేస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితులు అందుకు బిన్నంగా ఉన్నాయన్నారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: పందుల బెడద తప్పించేందుకు అధికారులు చర్యలు..