కరోనా థర్డ్ వేవ్ ప్రమాదకరంగా ఉంటుందన్న హెచ్చరికలతో నెల్లూరు జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తేదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోరారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు అదనంగా 50 పడకలు ఏర్పాటు చేయడం మంచిపరిణామమని అన్నారు. థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని మరో 300 పడకలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు.
మంత్రి అనిల్‌పై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నానని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చెప్పారు. మీరు ఎప్పుడు చెబితే అప్పుడు కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధమని సవాల్ చేశారు.
ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్: రాష్ట్రంలో 4 మరణాలు.. వందలాది కేసులు