ETV Bharat / state

'సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉన్న బిల్లులను ఆమోదించుకోవడం చట్టవిరుద్ధం'

సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉన్న సీ‌ఆర్‌డీ‌ఏ, మూడు రాజధానుల బిల్లులను శాసనసభలో ఆమోదించుకోవడం చట్ట విరుద్ధమని తెదేపా నేత అబ్దుల్ అజీజ్ అన్నారు. సంఖ్యాబలం ఉందని చట్టాలకు అతీతంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

abdul aziz comments on ycp government
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత అబ్ధుల్ అజీజీ వ్యాఖ్యలు
author img

By

Published : Jun 18, 2020, 7:55 PM IST

రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని తెదేపా నేత అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. వైకాపా మంత్రులు వీధిరౌడీల్లా వ్యవహరిస్తూ, ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి దాడులకు ప్రయత్నించడం సిగ్గుచేటని నెల్లూరులో ధ్వజమెత్తారు. సంఖ్యా బలం ఎక్కువ ఉందని, చట్టానికి విరుద్ధంగా సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉన్న సీ‌ఆర్‌డీ‌ఏ, మూడు రాజధానుల బిల్లులను శాసనసభలో ఆమోదించుకోవడం దారుణమన్నారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం ఆర్థిక ఇబ్బందులు ఉంటే... వైకాపా ప్రభుత్వం మాత్రం గత ఏడాది కన్నా అదనంగా 80 వేల కోట్లు పెంచి రూ. 2.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. కరోనాకు బడ్జెట్​లో నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరిపై ఒకరు ఆరోపించుకోవడంపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని అబ్దుల్ అజీజ్ కోరారు.

ఇదీ చూడండి: చైనా దురాగతాన్ని నిరసిస్తూ జిన్​పింగ్​ దిష్టిబొమ్మ దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.