ముఖ్యమంత్రి జగన్ అమరావతి రైతులనే కాకుండా 5 కోట్ల మంది ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని తెదేపా నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని నెల్లూరు జిల్లాలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని నినదిస్తూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
3 రాజధానుల పేరుతో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల త్యాగాలను అర్థం చేసుకొని మూడు రాజధానులు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
నాయుడుపేటలో...
జిల్లాలోని నాయుడుపేటలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద తెదేపా నాయకులు రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. వైకాపాకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు.
ఇదీ చదవండి: